జుట్టును సంరక్షించుకోవడం ఎలా!
మంచి జుట్టు ఉంటే ఇష్టం ఉండనిది ఎవరికి. ముఖ్యంగా అమ్మాయిలకు జుట్టు మీద మక్కువ చాలా ఎక్కువ. పొడవైన జుట్టు కోసం వారు ఎంతో తాపత్రయపడతారు. ఇక జుట్టు ఊడిపోతుంటే వారి బాధ వర్ణణాతీతం. ఐతే కాలుష్యం, మన జీవన శైలి తదితర కారణాలతో జుట్టు ఊడిపోవడం అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని జాగ్రత్తలతో ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని చెబుతున్నారు నిపుణులు. జట్టు రాలిపోవడం లాంటి సమస్యతో చాలా మంది అమ్మాయిలు మానసికంగా కూడా బాధపడుతున్నారని దీనికి పరిష్కార మార్గాలు ఉన్నా వాటి గురించి ఆలోచించట్లేదని వారు చెబుతున్నారు. ఐతే జుట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత ట్రీట్‌మెంట్ కోసం పరుగులు పెట్టే బదులు, జుట్టు రాలడం మొదలైన కొన్ని నెలల తర్వాత వైద్యం చేయించుకుంటే పరిస్థితి మెరుగవుతుందనేది వైద్యుల మాట. ఐతే వేగంగా శిరోజాలు పెరిగేందుకు మందులున్నాయని చాలామంది ప్రచారం చేస్తుంటారు. కానీ ఇది మోసమే. ఎందుకంటే ఇప్పటికదా అలాంటి వైద్యం కనిపెట్టలేదు. ఉన్నట్టుండి శిరోజాలు రావడం జరగదు. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రొసెస్ అని.. సైంటిస్టులు దీనిపై పరిశోధన చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఐతే జుట్టు రాలకుండా ఆపే మందులు మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఇవి దీర్ఘ కాలం వాడితేనే ఫలితం ఉంటుంది. మన ఇంటి వైద్యంతోనే జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చని వైద్యులు చెబుతున్నారు.
1. వేడి నూనెతో జుట్టును మర్థన చేయడం
వేడి నూనెతో మసాజ్ చేయడం వలన మీ జుట్టుకు అవసరమైన న్యూట్రియన్స్, విటమిన్స్ అందుతాయి.ఇలా చేయడం వలన జుట్టుకు మెరుపు వస్తుంది.
2. బంగాళాదుంప జ్యూస్‌ను అప్లే చేయడం
3. ఉల్లిపాయల రసాన్ని తలకు పట్టించడం
4. బలవర్ధకమైన ఆహారం (యుగార్ట్, పండ్లు, క్యారెట్స్ తదితరాలు)










